PM Modi | తెలంగాణలో రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్.. మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ
కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
- అట్టడుగు వర్గాలపై ఆ పార్టీ నిర్లక్ష్యం
PM Modi | నాగ్‌పూర్, అక్టోబర్ 5: కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ బూటకపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతుల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుల రుణాలు మాఫీ కాలేదని అన్నారు. దీంతో రైతులు ఇప్పుడు రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. రైతులను కాంగ్రెస్ గౌరవించదని, వారి అవసరాలను పట్టించుకోదని అన్నారు. డ్రగ్స్ వ్యాపారంలో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయని, ఢిల్లీలో దొరికిన డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత పాత్ర ఉందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

