Samvidhaan Hatya Diwas | అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన మోదీ : జైరాం రమేష్
Samvidhaan Hatya Diwas : 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు.
Samvidhaan Hatya Diwas : 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. దేశంలో పదేండ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీ కపట నాటకంతో మరో పతాక శీర్షికలను ఆకర్షించే పని చేశారని ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు.
ఈ ఏడాది జూన్ 4న దేశ ప్రజలు మోదీకి నైతిక, వ్యక్తిగీత, రాజకీయ ఓటమిని కట్టబెట్టి చరిత్రలో మోదీ ముక్త్ దివస్‌ను లిఖించారని అన్నారు. రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలపై ఓ పద్ధతి ప్రకారం మోదీ దాడికి తెగబడ్డారని దుయ్యబట్టారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించలేదని పేర్కొంటూ భారత రాజ్యాంగాన్ని సంఘ్ పరివార్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. కాగా, జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని పలు సందర్భాల్లో కాషాయ నేతలు కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు.
Read More :
Filmfare Awards | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా 8 అవార్డులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

