కాంగ్రెస్ పేరును మార్చుకుని ప్రజల వద్దకు వెళ్లాలి

-బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా
గ్వాలియర్, జూన్ 21: కాంగ్రెస్ పార్టీ తన పేరు మార్చుకుని తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్వాలియర్ పేరును మార్చాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం గ్వాలియర్‌లో సింధియా మాట్లాడుతూ.. ‘ఒకవేళ గ్వాలియర్ పేరు మార్చాలనే ఆసక్తి కాంగ్రెస్‌కు ఉంటే ముందు ఆ పార్టీ పేరును మార్చుకుని ప్రజల వద్దకు వెళ్లాలి. వారి హృదయాల్లో స్థానం ఏర్పరుచుకోవాలి’ అని సూచించారు. గ్వాలియర్ పేరును ‘మహారాణి లక్ష్మీభాయ్ నగర్’గా మార్చాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది బీజేపీలో చేరడానికంటే ముందు సింధియా చాలాకాలం కాంగ్రెస్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

