కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి 222 మంది నేతలు జంప్

న్యూఢిల్లీ: గత ఏడేండ్లలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దీనికి సంబంధించిన ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. 2014-2021 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 222 మంది (20 శాతం) నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. బీఎస్పీ తర్వాత స్థానంలో ఉన్నదని, ఆ పార్టీకి చెందిన 153 మంది (14 శాతం) ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరినట్లు వెల్లడించింది.
రాజకీయ పార్టీలు మారిన 1133 మందిలో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు 253 మంది (22 శాతం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2014-21 మధ్య జరిగిన ఎన్నికల్లో గరిష్ఠ సంఖ్యలో 177 మంది (35 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. అదే కాలంలో 33 మంది (7 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారని వివరించింది. పార్టీలు వీడిన నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లు పేర్కొంది.
2014-2021 మధ్య జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మారి పోటీ చేసిన 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 173 మంది (35 శాతం) బీజేపీలో, 61 మంది (12 శాతం) కాంగ్రెస్‌లో, 31 మంది (6 శాతం) తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది. 2014 నుండి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు మారి తిరిగి పోటీ చేసిన 1133 మంది అభ్యర్థులు, 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను ADR విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

