Congress presidential elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక.. ఓటేసిన సోనియా, ప్రియాంకా, ఖర్గే
Congress presidential elections:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బెంగుళూరులో ఓటేశారు. అధ్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి(Congress presidential elections) కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బెంగుళూరులో ఓటేశారు. అధ్యక్ష బరిలో ఖర్గే, శశి థరూర్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ఓటింగ్ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మక దినమని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. కర్నాటకలో మొత్తం 490 మంది ఓటు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా స్పందించారు. ఇది చరిత్రాత్మక రోజు అని, 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా పార్టీలో అంతర్గత విబేధాలు లేవని స్పష్టం అవుతోందన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గాంధీ కుటుంబంతో తన అనుబంధం యధావిధిగా కొనసాగుతుందన్నారు.
అక్టోబర్ 19వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

