Sonia Gandhi | బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విష కన్యనా? అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీని విష సర్పమని సంబోధించినందుకు స్పందనగా మర్నాడే బసనగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘వారు (కాంగ్రెస్) ఆయనను(మోదీ) కోబ్రాతో పోల్చి విషం చిమ్ముతున్నారని అంటున్నారు. సోనియా గాంధీ ఏమన్నా విష కన్యనా? ఆమె చైనా, పాకిస్థాన్‌తో పని చేస్తున్న వారి ఏజెంట్’ అని బసనగౌడ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమన్నది.