కాంగ్రెస్‌కు భారీ శస్త్ర చికిత్స అవసరం: వీరప్ప మొయిలీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ అన్నారు. సామర్థ్యం, ప్రజాధారణ ఉన్న నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపథ్యంలో గురువారం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జితిన్ బీజేపీలో చేరడంపై మొయిలీ పలు విమర్శలు చేశారు. జితిన్ మిగిలిన అన్నిటి కన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాదాన్యం ఇచ్చారని మండిపడ్డారు. జితిన్ సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని, ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదని, దీనిని బట్టి ఆయన అసమర్థుడని స్పష్టమవుతోందని విమర్శించారు. జితిన్‌కు పార్టీ చాలా బాధ్యతలు ఇచ్చిందని, అయితే యూపీలో కుల రాజకీయాలను ఆయన శాశ్వతం చేయాలనుకున్నారని మండిపడ్డారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని, పార్టీ భావజాలానికి కట్టుబడి ఉన్నవారికి బాధ్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వీరప్ప మొయిలీ సూచించారు. బాధ్యతలు అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పార్టీలోని నేతల సమర్థతను సరైన రీతిలో అధిష్ఠానం మదింపు చేయాలన్నారు. కాంగ్రెస్ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సమర్థులు కానివారికి పదవులు ఇవ్వవద్దని, పార్టీని సరైన విధంగా పునర్వ్యవస్థీకరించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మావలోకనం చేసుకోవాలని, ఇది పార్టీకి ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

