Kanhaiya Kumar | రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, తెలివితక్కువ వాడు.. కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ సంచలన వ్యాఖ్యలు
Kanhaiya Kumar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహార్‌కు చెందిన పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జి కన్నయ్య కుమార్ విరుచుకుపడ్డారు.
Kanhaiya Kumar | పాట్నా : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహార్‌కు చెందిన పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జి కన్నయ్య కుమార్ విరుచుకుపడ్డారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో కన్నయ్య కుమార్‌తో ఓ జాతీయ మీడియా(న్యూస్ 24) ప్రెస్‌మీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు అని రేవంత్ రెడ్డికి కన్నయ్య కుమార్ చురకలంటించారు. రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా.. నేను భయపడను అని కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్
రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు
బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు
దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు
రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే… pic.twitter.com/bcHxFWQVMc
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా : ప్రశాంత్ కిశోర్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త బీహార్ వాసి ప్రశాంత్ కిశోర్ శపథం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని అవహేళన చేసి బీహారీలను రేవంత్ రెడ్డి అవమానించారని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్న ప్రశాంత్ కిశోర్ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కన్నా బీహారీల డీఎన్ఏ నాసిరకమని ఈ వ్యక్తి(రేవంత్) అంటున్నాడు.
అదే నిజమైతే ‘సాయం చేయండంటూ నన్ను ఎందుకు అడుక్కున్నాడు? రాహుల్ గాంధీ కూడా ఆయనను కాపాడలేరు. ఆయనను ఎవరూ కాపాడలేరు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి తీరతాను అని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాజకీయ వ్యూహకర్తగా ఉన్న తన వద్దకు రేవంత్ రెడి ్డమూడుసార్లు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎంత గర్వం తలకెక్కిందంటే మా బీహారీలనే అవమానించారు అంటూ కిశోర్ మండిపడ్డారు. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ది బీహార్ డీఎన్ఏ అంటూ ఆరోపణలు గుప్పించారు. తనది తెలంగాణ డీఎన్గా వర్ణించుకుంటూ, కేసీఆర్ కన్నా తానే ముఖ్యమంత్రి పదవికి అర్హుడినని, బీహార్ డీఎన్ఏ కన్నా తెలంగాణ డీఎన్ఏనే గొప్పదని రేవంత్ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్‌కు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇవే వ్యాఖ్యలను ఆయన గుర్తుచేసుకుంటూ మా కన్నా మీ డీఎన్ఏ గొప్పదైతే సాయం కోసం మా దగ్గరకు ఎందుకు వచ్చావు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. బీజేపీ నుంచి టీడీపీకి, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిని రాజకీయ విశ్వాస ఘాతకునిగా కిశోర్ అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

