సర్జికల్ స్ట్రైక్స్ వీడియో బయటపెట్టండి : కాంగ్రెస్ నేత రషీద్ అల్వి డిమాండ్
సర్జికల్ స్ట్రైక్స్‌పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్‌పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై వీడియో ఉంటే దాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి డిమాండ్ చేశారు.
పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సైనిక దాడుల వీడియోను విడుదల చేయాలని కోరారు. మన భద్రతా దళాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అయితే బీజేపీ ప్రభుత్వాన్ని తాము విశ్వసించలేమని ఆయన పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, అందుకే ఆ వీడియోలు బయటపెట్టాలని దిగ్విజయ్ సింగ్ కోరడంలో తప్పేముందని రషీద్ అల్వి ప్రశ్నించారు.
సర్జికల్ స్ట్రైక్స్ గురించి అమిత్ షా ఓ రకంగా చెబుతుంటే యోగి ఆదిత్యానాధ్ మరో రకంగా చెబుతున్నారని అందుకే తాము ఆ వీడియోలను బయటపెట్టాలని కోరుతున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నవారు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో ఏ ప్రకటన విశ్వసించాలన్నదే ప్రశ్నని, బీజేపీకి కొనసాగింపే సైన్యం అనేలా కాషాయ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. ఆర్మీ దేశానికి చెందినదని, బీజేపీది కాదని అల్వి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

