Congress | రాహుల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు : కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం
Congress : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
Congress : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి.
బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ అన్నారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. రవ్నీత్ బిట్టూ ఇటీవల బిహార్‌లోని భాగల్పూర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి మారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్‌ను సమర్దిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్‌ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు.
Read More :
Revanth Reddy | ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా.. మనకు రావాల్సిన నిధుల కోసమే వెళ్తున్నా..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

