సోనియా చేతుల్లోనే జారిపడ్డ కాంగ్రెస్ పార్టీ జెండా.. వీడియో
Congress Party Flag | ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జెండాకు కట్టిన తాడును కార్యాలయ సిబ్బంది వేగంగా లాగాడు. సోనియా కూడా అంతే వేగంతో తాడును లాగారు. దీంతో ఎగరాల్సిన జెండా కాస్త ఊడి సోనియా మీద పడిపోయింది.

జెండా కింద పడిపోవడంతో అక్కడున్న నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఓ మహిళా కార్యకర్త వేగంగా వచ్చి.. జెండాను సర్దే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఆ జెండాను ఎగురవేయకుండానే పక్కకు పెట్టేశారు. ఇక సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని కార్యకర్తలు నినదించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఎంపీ రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

