శాంతిభద్రతలు నా పరిధిలోనివి కాదు
ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, ఆంక్షల పరిస్థితిపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ స్పందిస్తూ, ఇది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై పలు ఆరోపణలతో మెమోరాండం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కోరిన వ్యక్తిగత భేటీని ఆయన తిరస్కరించారు.
- భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, ఆంక్షల పరిస్థితిపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ స్పందిస్తూ, ఇది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై పలు ఆరోపణలతో మెమోరాండం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కోరిన వ్యక్తిగత భేటీని ఆయన తిరస్కరించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై బయట సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ సిద్ధాంతానికి, న్యాయ నైతికతకు విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు.
అలా అయితే రాజీనామా చేయండి సీజేఐపై కాంగ్రెస్ వివాదాస్పద పోస్ట్
శాంతిభద్రతలు తన పరిధిలోని అంశం కాదని సీజేఐ చేసిన వ్యాఖ్యలపై కేరళ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, శాంతిభద్రతలు మీ పరిధి కానప్పుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని, ఆ బాధ్యతలు సమర్థంగా నిర్వహించగల మరొకరిని తాము ఎంపిక చేసుకుంటామంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో కాంగ్రెస్ పార్టీ కొద్ది గంటల్లోనే ఆ పోస్టును తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

