PM Modi: ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ తప్పుదోవపట్టించింది: ప్రధాని మోదీ
PM Modi: ఆర్టికల్ 370 పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవపట్టించిందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే ఆ ఆర్టికల్ వల్ల లబ్ధి పొందినట్లు ఆయన ఆరోపించారు. శ్రీనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ శ్రీనగర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆంక్షల నుంచి స్వేచ్ఛ దొరికిందన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో పాటు మిత్రపక్ష పార్టీలు 370 ఆర్టికల్ పేరుతో జమ్మూకశ్మీర్ ప్రజల్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 నుంచి జమ్మూకశ్మీర్ లబ్ధి పొందిందా, లేదా కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయా అని ఆయన ప్రశ్నించారు. తమను తప్పుదోవ పట్టించారన్న విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆలస్యంగా గ్రహించారని మోదీ పేర్కొన్నారు. కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్ను సంకెళ్లలో వేసేశారన్నారు. ఇవాళ జమ్మూకశ్మీర్లో 370 లేదు అని, దీని వల్ల ఆ రాష్ట్ర యువత ప్రతిభకు గౌరవం దక్కుతోందని, ఫలితంగా కొత్త అవకాశాలు వస్తున్నట్లు మోదీ చెప్పారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

