Monkeypox | దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ.. రాష్ర్టాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశం నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ‘ఎంపాక్స్' ఉందని నిర్ధారణ అయింది. రోగికి పశ్చిమ ఆఫ్రికా క్లేడ్-2 రకం వైరస్ ఉందని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
- విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ ఉన్నట్టు గుర్తింపు
- క్లేడ్ 2 రకం వైరస్‌గా గుర్తింపు
Monkeypox | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మంకీపాక్స్ (ఎంపాక్స్) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశం నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ‘ఎంపాక్స్’ ఉందని నిర్ధారణ అయింది. రోగికి పశ్చిమ ఆఫ్రికా క్లేడ్-2 రకం వైరస్ ఉందని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన ప్రజారోగ్య అత్యయికి స్థితికి కారణమైన క్లేడ్ 1 రకానికి చెందిన కేసు కాదని, ఆందోళన అక్కర్లేదని తెలిపింది. భారత్‌లో 2022 జూలై తర్వాత 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. అలాంటిదే ఈ కేసు కూడా అని కేంద్రం పేర్కొన్నది. ఎంపాక్స్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది.
ఎంపాక్స్ వైరస్‌కు సంబంధించి.. ప్రస్తుతం మనదేశంలో ప్రజలకు ఎలాంటి ముప్పూ లేదని, వైరస్ వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని వెల్లడించింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎంపాక్స్ రెండో వేవ్ మొదలవ్వటంతో, ప్రజా ఆరోగ్యంపై గత నెలలో డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరోవైపు, మంకీపాక్స్‌పై రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎంపాక్స్ అనుమానిత కేసుల స్క్రీనింగ్, టెస్టింగ్‌లను నిర్వహించాలని, అలాగే వ్యాధి నిర్ధారిత, అనుమానిత రోగులకు అవసరమయ్యే ఐసొలేషన్ సౌకర్యాలు కల్పించాలని అడ్వైజరీ జారీ చేసింది. ప్రజల్లో ఎలాంటి భయాందోళనలకు తావివ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

