యోగిపై వివాదాస్పద వ్యాఖ్యలు : మహారాష్ట్ర సీఎం ఠాక్రేపై బీజేపీ ఫిర్యాదు

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2018లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై చేసిన వ్యాఖ్యలకు గాను ఠాక్రేపై నాసిక్‌లోని సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ యావత్మాల్ జిల్లా అధ్యకుడు కూడా ఠాక్రే వ్యాఖ్యలకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాక్రేపై కేంద్ర మంత్రి నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
యోగి ఆదిత్యానాధ్పై ఠాక్రే గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. యోగి పాల్ఘర్ పర్యటనలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో చెప్పులు ధరించారని, దీంతో అదే చెప్పులతో ఆయనను కొట్టాలని అనిపించిందని ఠాక్రే అనడం ఈ వీడియోలో కనిపించింది. ఆయన యోగి అయితే సీఎం ఎలా అవుతారని, యోగి అన్నీ త్యజించి గుహలో కూర్చోవాలని..సీఎం కుర్చీలో కూర్చుని తనను తాను యోగి అని చెప్పుకుంటున్నారని ఈ వీడియోలో అన్నారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఠాక్రేపై చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

