Commercial LPG | నేటి నుంచి అమల్లోకి.. మరోసారి తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG) మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి.
న్యూఢిల్లీ: వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG) మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో రూ.1665గా వాణిజ్య సిలిండర్ రూ.1631.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1735.50, ముంబైలో రూ.1616.50, చెన్నై రూ.1790 కు తగ్గింది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.
ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.853గా ఉండగా, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, హైదరాబాద్‌లో రూ.905గా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

