UPS | బేసిక్‌పై 50 శాతం పింఛన్.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్ రూపంలో అందుతుంది.
- చివరి 12 నెలల సగటు బేసిక్ పేపై 50% పెన్షన్
- 2004 ఏప్రిల్ 1 తర్వాత చేరిన వారికి వర్తింపు
- 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం
- ఎన్‌పీఎస్‌లో కొనసాగడమా, యూపీఎస్‌లో చేరడమా అన్నది ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు
UPS | న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్ రూపంలో అందుతుంది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్ పథకం వర్తిస్తుంది.
2004లో తీసుకువచ్చిన కొత్త పింఛన్ పథకాన్ని(ఎన్పీఎస్) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో కేంద్రం టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

యూపీఎస్‌లోని 5 కీలక అంశాలు
కచ్చితమైన పింఛన్: కనీసం 25 ఏండ్ల సర్వీసు ఉన్న వారు కచ్చితమైన పింఛన్‌కు అర్హులు. వీరు పదవీ విరమణకు ముందు 12 నెలల పాటు అందుకున్న బేసిక్ పే సగటు 50 శాతం పింఛన్ రూపంలో ప్రతి నెల కచ్చితంగా అందుతుంది. కనీసం పదేండ్ల పైన, 25 ఏండ్లకు తక్కువ సర్వీసు చేసి పదవీ విరమణ పొందిన వారికి వారి సర్వీసుకు తగ్గట్టుగా పింఛన్ ఉంటుంది.
కచ్చితమైన కుటుంబ పింఛన్: ఉద్యోగి మరణించే నాటికి అందుకుంటున్న పింఛన్లో 60 శాతం కచ్చితమైన కుటుంబ పింఛన్‌గా ఉద్యోగి కుటుంబానికి అందుతుంది.
కచ్చితమైన కనీస పింఛన్: కనీసం పదేండ్ల సర్వీసు ఉండి రిటైర్ అయిన వారికి కనిష్టంగా రూ.10,000 కచ్చితంగా పింఛన్ అందుతుంది.
ద్రవ్యోల్బణ ఇండెక్సేషన్: కచ్చితమైన పింఛన్, కచ్చితమైన కుటుంబ పింఛన్, కచ్చితమైన కనీస పింఛన్‌పై ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇది డియర్నెస్ రిలీఫ్ ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్(ఏఐసీసీఐ-ఐడబ్ల్యూ)పై ఆధారపడి ఉంటుంది.
పదవీ విరమణ సమయంలో..
గ్రాట్యూటీకి అదనంగా పదవీవిరమణ సమయంలో ఉద్యోగులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ప్రతి ఆరు నెలల సర్వీసు పూర్తిపై నెల వేతనం(పే + డీఏ)లో పదో వంతును లెక్కగట్టి ఇస్తుంది. ఈ చెల్లింపు కచ్చితమైన పింఛన్ మొత్తాన్ని తగ్గించదు.
యూపీఎస్ ఎవరికి?
ఎన్‌పీఎస్‌లో కొనసాగడమా? కొత్తగా యూపీఎస్‌లో చేరడమా అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చని అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. ఇది 2004లో ఎన్పీఎస్ను అమలులోకి తీసుకొచ్చినప్పటి నుంచి యూపీఎస్ అమలులోకి వచ్చే ముందురోజైన 2025 మార్చి 31 వరకు పదవీ విరమణ పొందిన వారికి, పొందబోయే వారికి కూడా వర్తిస్తుందని క్యాబినెట్ కార్యదర్శిగా ఎంపికైన టీవీ సోమనాథన్ తెలిపారు. ఇందుకుగానూ వారు అందుకున్న పింఛన్, యూపీఎస్ ప్రకారం అందాల్సిన పింఛన్‌ను సర్దుబాటు చేసి బకాయి ఉంటే చెల్లించనున్నట్టు చెప్పారు.
ఎన్పీఎస్కు, యూపీఎస్‌కు తేడా ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు ఎన్పీఎస్ అమలు చేస్తున్నది. దీంట్లో కచ్చితంగా ఇంత మొత్తం పింఛన్ అందుతుందనే హామీ లేదు. ఉద్యోగి తన సర్వీసులో పింఛన్ కోసం అందించిన కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి, దానిపై వచ్చే రిటర్న్స్‌పై పింఛన్ ఆధారపడి ఉంటుంది. యూపీఎస్ అంటే కచ్చితంగా ఇంత పింఛన్ అందుతుందనే హామీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

