CAA portal | సీఏఏకు పోర్టల్.. ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే మొబైల్ అప్లికేషన్
CAA portal | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించింది.
- సీఏఏపై భగ్గ్గమన్న నిరసనలు
- అస్సాం, కేరళలో ఆందోళనలు
- సీఏఏను అమలుచేయబోమన్న బెంగాల్, తమిళనాడు సీఎంలు
న్యూఢిల్లీ/గువాహటి, మార్చి 12: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించింది. అర్హులైన వారు indiancitizenshiponline.nic.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. త్వరలోనే ‘సీఏఏ-2019’ పేరిట మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలకు కేంద్ర హోం శాఖ భరోసా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రభావం వారి పౌరసత్వంపై పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సీఏఏ అమలు చేయబోం
సీఏఏను తమ రాష్ట్రంలో అమలుచేయబోమని తమిళనాడు, బెంగాల్ సీఎంలు స్టాలిన్, మమతాబెనర్జీ స్పష్టంచేశారు. సీఏఏ నిబంధనలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజల్లో విభజన తేవడానికి తప్ప దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్టాలిన్ విమర్శించారు. బహుళత్వం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలు, శ్రీలంక తమిళ శరణార్థులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయబోమని తెగేసి చెప్పారు. సీఏఏ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని మమతాబెనర్జీ పేర్కొన్నారు. దీనికి దరఖాస్తు చేసే ముందు ప్రజలు పలుమార్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వెల్లువెత్తిన నిరసనలు
సీఏఏకు వ్యతిరేకంగా అస్సాంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలతో పాటు సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు తగులబెట్టారు. 16 పార్టీల ఐక్య విపక్షాల కూటమి యునైటెడ్ అపోజిషన్ ఫోరమ్ అస్సాం (యూఓఎఫ్‌ఏ) 12 గంటల హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. పలు జిల్లాల్లో వ్యాపార సంస్థలను మూసివేశారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ నిరసన ర్యాలీలు నిర్వహించాయి.
సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్
సీఏఏని సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ గతంలో సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున సీఏఏ అమలుపై స్టే విధించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టును కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

