CM Vijay | సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు.. విచారణ వచ్చే నెలకు వాయిదా..!
CM Vijay | తమిళనాడు సీఎం (Tamil Nadu CM), ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) ఆయన భార్య సంగీత స్వర్ణలింగం (Sangeeta Swarnalingam) విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ చెంగల్పట్టు (Chengalpattu) మహిళా కోర్టు (Woman Court) లో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.
CM Vijay : తమిళనాడు సీఎం (Tamil Nadu CM), ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) ఆయన భార్య సంగీత స్వర్ణలింగం (Sangeeta Swarnalingam) విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ చెంగల్పట్టు (Chengalpattu) మహిళా కోర్టు (Woman Court) లో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌కి మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
తన పిటిషన్లో సంగీత పలు సంచలన ఆరోపణలు చేశారు. 2021 లోనే విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని తాను గుర్తించానని, దీనిపై నిలదీసినప్పుడు ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. అయినప్పటికీ, విజయ్ ఆ సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా సదరు నటితో కలిసి విహారయాత్రలకు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించారు. వారిద్దరూ బహిరంగ ప్రదేశాల్లో కలిసి ఉన్న ఫొటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తనను, తన ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాను తీవ్ర అవమానానికి గురిచేశారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, గతంలో ఉన్న సౌకర్యాలను ఉపసంహరించుకుని, తన స్వేచ్ఛను కూడా నియంత్రించారని సంగీత ఆరోపించారు. ఈ పరిణామాలవల్ల తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 27 (1)(a), 27(1)(d) కింద తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న విజయ్, సంగీత.. తమ 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణ ఏప్రిల్ 20 నే జరగాల్సి ఉండగా.. వారిద్దరూ హాజరుకాకపోవడంతో జూన్ 15న తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఈ గందరగోళం నడుస్తుండగా.. మరోవైపు విజయ్ రాజకీయ ప్రస్థానం ఉన్నత శిఖరాలకు చేరింది. ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. దాదాపు 60 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఓడించి మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

