Rebellion in JDU | జేడీయూలో తిరుగుబాటు.. ఎమ్మెల్యేలు పాట్నా దాటొద్దన్న నితీశ్?
Rebellion in JDU | కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ సారధ్యంలో యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ)లో తిరుగుబాటు వచ్చే సంకేతాలు ఉన్నాయి.
Rebellion in JDU | బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సారధ్యంలోని యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ)లో అసమ్మతి మొదలైందా.. అది తిరుగుబాటుగా మారుతుందా.. కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ దీనికి సారధ్యం వహిస్తారా? అంటే ఇప్పటికిప్పుడు పరిస్థితులలా మారాయని చెప్పలేం గానీ.. వచ్చే 72 గంటలు మాత్రం జేడీయూ ఎమ్మెల్యేలు పాట్నా నుంచి బయటకు వెళ్లొద్దని హుకుం జారీ చేశారు నితీశ్ కుమార్. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ జారీ చేసిన ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కుల గణన జరుపాలన్న డిమాండ్‌పై బీహార్ సీఎం నితీశ్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం. ఇందుకోసం 27న అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నారు. మరోవైపు, జేడీయూలో తిరుగుబాటు రానున్నదన్న వదంతులు వినిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌ను మళ్లీ రాజ్యసభకు పంపడానికి నితీశ్‌కుమార్ సుముఖంగా లేరని సమాచారం. రాజ్యసభ సీటు తిరిగి పొందే అవకాశాలను ఆర్సీపీ సింగ్ వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. ఈ పరిస్థితుల్లో జేడీయూలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ ఆర్సీపీ సింగ్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధ పడితే.. జేడీయూ చీలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు ఆర్సీపీ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం రాజ్‌గిర్‌కు వెళ్లనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం నితీశ్.. రాజ్‌గిర్ టూర్కెళ్లినప్పుడల్లా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2017లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమికి తిలోదకాలిచ్చేందుకు కొన్ని రోజుల ముందు రాజ్‌గిర్ పట్టణానికి నితీశ్ కుమార్ వెళ్లారు. రాజ్‌గిర్ నుంచి తిరిగొచ్చాక మహా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్వయంగా నితీశ్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.
తిరుగుబాటును పసిగట్టిన జేడీయూ సీనియర్ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆర్సీపీ సింగ్‌కు బదులు మరో నాయకుడికి ఓటేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు పాట్నాలోనే ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించినట్లు సమాచారం.
జేడీయూలో పరిణామాలపై మిత్రపక్షం బీజేపీ నోరు మెదపడం లేదు. ఇది జేడీయూ అంతర్గత వ్యవహారం అని, దీనిపై తమ పార్టీ చేసేదేమీ లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. నితీశ్ కుమార్ సర్కార్ పూర్తి పదవీ కాలంలో కొనసాగుతుందని చెప్పారు. సీఎం నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు పాట్నా వీడొద్దన్న ఆదేశాలు వట్టి వదంతి మాత్రమేనని అన్నాయి. ఎమ్మెల్యేలు పాట్నాకు బయటే ఉన్నారని తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

