CM KCR | మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సంతాపం
CM KCR: మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బుల్దానా సిటీ వద్ద జరిగిన ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మహారాష్ట్రలోని సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
బస్సు డ్రైవర్‌ను, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు. బస్సు టైరు పేలడం వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న కారణంగా 25 మంది సజీవ దహనం అయ్యారు. బోల్తా కొట్టిన బస్సు డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

