పెండింగ్ కేసులపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
జైపూర్ : కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్ధలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసులు పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు. జైపూర్‌లో జరిగిన అఖిల భారత న్యాయ సేవల అథారిటీస్ సమావేశంలో న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లేవనెత్తిన అంశాలకు జస్టిస్ ఎన్వీ రమణ బదులిచ్చారు.
న్యాయ శాఖ మంత్రి ప్రస్తావించిన అంశాలపై స్పందించడం తన బాధ్యతని పేర్కొన్న జస్టిస్ ఎన్వీ రమణ పెండింగ్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. న్యాయమూర్తులుగా తాము విదేశాలకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటారని, ఓ కేసును పరిష్కరించేందుకు ఎన్నేండ్ల సమయం పడుతుందని అడుగుతుంటారని చెప్పుకొచ్చారు. పెండింగ్ కేసులకు కారణమేంటో మీ అందరికీ తెలుసని, దానిపై తాను సవివరంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు.
న్యాయవ్యవస్ధలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో పాటు జ్యుడిషియల్ మౌలిక వసతులను మెరుగుపరచకపోవడమే పెండింగ్ కేసులు పేరుకుపోవడానికి కారణమని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను గతంలో ప్రధాన న్యాయమూర్తులు-ముఖ్యమంత్రుల సమావేశంలోనూ తేల్చిచెప్పానని తెలిపారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్ధ శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖాళీల భర్తీ, కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ఏర్పాటు చేయాలని తాము సూచించామని, అయితే ఈ ప్రతిపాదన ఇంకా కార్యరూపానికి రాలేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CJI
- NV Ramana
- pending cases
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

