పెరుగుతున్నకరోనా కేసులు.. విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు..

హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించట్లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉంది. విమానాల్లో ప్రయాణించే చాలామంది సైతం నిబంధనలు పాటించడం లేదని కేంద్ర పౌరవిమానయాన సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు విధించింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని, లేదంటే విమానం నుంచి దించేయాలని స్పష్టం చేసింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
డీజీసీఏ నూతన ఆదేశాలివే..
1. విమాన ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. మాస్కు ముక్కు కిందకు ఉండకూడదు.. సరిగ్గా ధరించాలి.
2. విమానాశ్రయ ప్రవేశద్వారాల వద్ద సీఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్ లేకుండా ఎయిర్‌పోర్టు లోపలికి ఎవర్నీ అనుమతించకూడదు.
3. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లేదా టర్మినల్ మేనేజర్ చూసుకోవాలి. ఏ ప్రయాణికుడైనా కొవిడ్ 19 నిబంధనలు పాటించకపోతే వారిని భద్రతా సిబ్బందికి అప్పగించాలి.
4. విమానంలోకి ఎక్కిన తర్వాత అందరూ మాస్క్‌లు పెట్టుకునేలా చూసుకోవాలి. సిబ్బంది హెచ్చరించినా మాస్క్ పెట్టుకోకపోతే ఆ ప్రయాణికులను టేకాఫ్‌కు ముందే విమానం నుంచి దించేయాలి.
5. ప్రయాణ సమయంలో విమానంలో కొవిడ్ నిబంధనలు పదే పదే ఉల్లంఘించిన వారిని ‘నిషేధిత జాబితాలోని ప్రయాణికుడి’గా పరిగణించాలి. సదరు విమానయాన సంస్థ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

