NEET-UG 2024: ఎన్టీఏ వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల వారిగా నీట్ యూజీ ఫలితాలు రిలీజ్..
NEET-UG 2024 : సిటీ, సెంటర్ వైజ్‌గా .. నీట్ యూజీ 2024 ఫలితాలను రిలీజ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైబ్సైట్లో ఆ ఫలితాలను పొందుపరిచారు. పరీక్ష కేంద్రాల వారిగా ఫలితాలను రిలీజ్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. ఇవాళ నీట్ యూజీ 2024(NEET-UG 2024) ఫలితాలను తన్ వెబ్సైట్లో ప్రచురించింది. నీట్ యూజీ ఫలితాలను https://neet.ntaonline.in/frontend/web/common-scorecard/index లింక్‌లో చూడగలరు. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించాలని సుప్రీంలో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ కేసులో సుప్రీం తీర్పునిస్తూ.. పరీక్ష కేంద్రాల వారీగా మార్క్‌లను వెల్లడించాలని ఎన్టీఏకు సుప్రీం ఆదేశించింది. ప్రతి సెంటర్, ప్రతి నగరానికి చెందిన ఫలితాలను రిజల్ట్స్‌ను డిక్లేర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఫలితాలను వెబ్సైట్లో రిలీజ్ చేశారు.
జూలై 20 మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాలను రిలీజ్ చేయాలని సుప్రీం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థుల గుర్తింపును మాత్రం గోప్యంగా ఉంచాలని సూచించింది. నీట్-యూజీలో అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని ఒక బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

