కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 18 : ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో మరో 9 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారులు గురువారం తెలిపారు. కాగా, ఇది నమ్మకద్రోహంతో చేసిన ఎన్కౌంటర్ అని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు దండకారణ్యం క్రాంతికారి మహిళా సంఘటన్ ప్రతినిధి రామ్కో హిచామి పేరుతో లేఖ విడుదల చేశారు.