Chennai | చెన్నైలో తల్లిపాలతో వ్యాపారం.. 200 మి.లీ.కు వెయ్యి రూపాయలు!
Chennai | తమిళనాడు రాజధాని చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
Chennai | తమిళనాడు రాజధాని చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
తల్లిపాల వ్యాపారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిషేధం ఉన్నప్పటికీ.. కొంతమంది అక్రమంగా ఈ దందాను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై మహానగరంలోని మాధవరంలో ముత్తయ్యకు చెందిన ఓ వ్యాక్సిన్ స్టోర్‌పై దాడి చేసిన ఉన్నతాధికారులు తల్లి పాలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రోటీన్ పౌడర్ విక్రయానికి లైసెన్స్ తీసుకుని ఆ ముసుగులో తల్లిపాలను విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. 50 బాటిళ్ల తల్లిపాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆ బాటిళ్లను గిండీలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌కు పంపించారు. ముత్తయ్య తల్లిపాలను ఎలా సేకరించాడు? ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తల్లి పాలను దానం చేసే మహిళల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన ఓ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌బుక్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.
తల్లిపాల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధం విధించిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. తల్లిపాలను దీర్ఘకాలం నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. అలాగే తల్లిపాలలో ఉండే సహజ ప్రోటీన్లు కూడా నశిస్తాయని పేర్కొన్నారు. అందుకే తల్లిపాలను నిల్వ చేసి అమ్మడాన్ని నిషేధించారని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- breast milk
- Chennai
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

