Kuno National Park | కునో నేషనల్ పార్క్‌లో మరో రెండు చిరుత పిల్లలు మృతి..
Kuno National Park | కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి.
Kuno National Park | కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.
అయితే, తీవ్రమైన వేడి కారణంగా వాటి ఆరోగ్యం క్షీణించింది పార్క్ అధికారులు పేర్కొంటున్నారు. వీటి మరణంతో కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది. 23న చిరుత పిల్ల మృతి చెందిన తర్వాత మూడింటితో పాటు జ్వాలాను పాల్పూర్‌లోని వన్యప్రాణుల వైద్యశాలకు తరలించారు. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించినా వాటిని కాపాడలేకపోయారు. జ్వాలాతో పాటు పిల్లలు మామూలుగా లేవని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యాయని, పుట్టినప్పటి నుంచి అవి బలహీనంగానే ఉన్నాయని అటవీశాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా.. 1948లో మధ్యప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో చిరుతల ( ఓ రకమైన) ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 75 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా 20 చిరుతలను కునో నేషనల్ పార్క్‌కు కేంద్రం తరలించగా.. గతేడాది ప్రధాని తన పుట్టిన రోజున సందర్భంగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. ఇప్పటి వరకు సాషా, దక్ష అనే ఆడ చిరుతలతో పాటు ఉదయ్ అనే మగ చిరుత ఇటీవల మరణించాయి. జ్వాలాకు జన్మించిన నాలుగు పిల్లల్లో మూడు మృతి చెందాయి. ప్రస్తుతం ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, ఒక పిల్ల మిగిలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

