లొకేషన్ మార్కర్‌గా విక్రమ్ ల్యాండర్
జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తున్నది. విక్రమ్ ల్యాండర్‌లోని ‘ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే(ఎల్ఆర్ఏ) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్‌గా పని చేస్తున్నట్టు శుక్రవారం ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
- నిద్రాణ స్థితిలోనూ సేవలు
బెంగళూరు, జనవరి 19: జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తున్నది. విక్రమ్ ల్యాండర్‌లోని ‘ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే(ఎల్ఆర్ఏ) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్‌గా పని చేస్తున్నట్టు శుక్రవారం ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్ 12 నుంచి నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటల్ ఎల్ఆర్ఏ నుంచి సంకేతాలను గుర్తించినట్టు పేర్కొంది.
అంతర్జాతీయ సహకార ఒప్పందంలో భాగంగా నాసాకు చెందిన ఎల్ఆర్ఏను విక్రమ్ ల్యాండర్లో పొందుపరిచారు. ఇందులో అర్ధ గోళాకారంలో ఉన్న 8 కార్నర్ క్యూబ్ రిఫ్లెక్టర్లు ఉంటాయి. ఏదైనా అంతరిక్ష నౌక ద్వారా విడుదలైన లేజర్ కిరణాలను ఇవి వికిరణం చేస్తాయి. చంద్రుడిపైకి వివిధ ఎల్ఆర్ఏలు పంపినప్పటికీ, మిగతా వాటితో పోలిస్తే చంద్రయాన్-3లోని ఎల్ఆర్ఏ పరిమాణంలో చిన్నది.
చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేవలందిస్తున్న ఎల్ఆర్ఏ ఇదొక్కటే. 20 గ్రాముల బరువుండే ఈ పరికరాన్ని భవిష్యత్తులో దశాబ్దాల పాటు సేవలందించేలా రూపొందించారు. చంద్రయాన్ -3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ గతేడాది ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. 14 రోజులపాటు ప్రజ్ఞాన్ రోవర్‌తోపాటు జాబిలిపై పరిశోధనలు చేసింది. భూమికి విలువైన సమాచారాన్ని చేరవేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

