Chandrayan-3 | చందమామకు మరింత చేరువైన చంద్రయాన్-3.. ఇక ఉపరితలంపై దిగడమే తరువాయి
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతున్నది.
అంతా సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లో చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. రేపు (ఆగస్టు 17న) స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. చంద్రయాన్-2 సందర్భంగా ల్యాండింగ్ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చందమామపై దిగే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

