Chandrayaan-2 | చంద్రుడిపై భారీగా సోడియం.. గుర్తించిన చంద్రయాన్-2
Chandrayaan-2 | మన చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2లో ఉన్న క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లు
మన చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2లో ఉన్న క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1ఎక్స్ఎస్) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించింది.
ఇప్పుడు చంద్రయాన్-2 ఈ సోడియం మ్యాపింగ్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. హైసెన్సిటివిటీ, సామర్ధ్యం కలిగిన క్లాస్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో తయారుచేసినట్లు ఇస్రో తెలిపింది. దీనివల్లనే ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని పరిశోధకులు చెప్పారు. లూనార్ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియం కళాలను ఈ క్లాస్ గుర్తించింది.
చంద్రుడిపై ఉన్న వాతావరణంలో ఇలా సోడియం లభించడం ఆశ్చర్యకరమని చెప్పారు. ఈ మేరకు ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైన కథనంలో ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల వరకు సోడియం జాడలు కనిపించినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలం, ఎక్సోస్ఫేర్ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తాజా పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల భావన.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
శ్రీజ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

