Chandipura virus | కలకలం రేపుతున్న చాందిపుర వైరస్.. గుజరాత్లో మరో మరణం
Chandipura virus | గుజరాత్ (Gujarat) లో చాందిపుర వైరస్ (Chandipura virus) కలకలం రేపుతున్నది. ఆ వైరస్ బారినపడి ఇప్పటికే సబర్‌కాంతా జిల్లాలో ఒక చిన్నారి మరణించాడు. తాజాగా వడోదర జిల్లాలో మరో మరణం సంభవించింది.
Chandipura virus : గుజరాత్ (Gujarat) లో చాందిపుర వైరస్ (Chandipura virus) కలకలం రేపుతున్నది. ఆ వైరస్ బారినపడి ఇప్పటికే సబర్‌కాంతా జిల్లాలో ఒక చిన్నారి మరణించాడు. తాజాగా వడోదర జిల్లాలో మరో మరణం సంభవించింది. దాంతో వడోదర జిల్లాలో తొలి మరణం, గుజరాత్లో రెండో మరణం సంభవించినట్లయ్యింది.
ఇటీవల అస్వస్థతకు గురైన ఆరేళ్ల బాలుడిని ఎస్ఎస్జీ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి కేవలం 10 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆ బాలుడి వైద్య పరీక్షల రిపోర్టులో చాందిపుర వైరస్ సోకినట్లు తేలింది. గత కొన్ని రోజులుగా గుజరాత్లో చాందిపుర వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
హిమ్మత్‌నగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో పలువురు చిన్నారులకు చికిత్స జరుగుతోంది. చాందిపురా వైరస్ కేసుల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ వైరస్ సోకిన వారికి ఫ్లూ లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్ర స్థాయి ఎన్సెఫలైటిస్ కూడా వస్తుంది. దోమలు, పురుగుల ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

