Encounter Specialist | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్‌ను టార్గెట్ చేసిన చైన్ స్నాచర్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Encounter Specialist | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న పోలీస్‌ను చైన్ స్నాచర్లు టార్గెట్ చేశారు. గన్ చూపించి ఆయన మెడలోని గోల్డ్ చైన్ తీసి ఇవ్వాలని బెదిరించారు. అలాగే గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు.
న్యూఢిల్లీ: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న పోలీస్‌ను (Encounter Specialist ) చైన్ స్నాచర్లు టార్గెట్ చేశారు. గన్ చూపించి ఆయన మెడలోని గోల్డ్ చైన్ తీసి ఇవ్వాలని బెదిరించారు. అలాగే గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పోలీస్ అధికారి ఎదురుదాడి చేసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన వినోద్ బడోలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుపొందారు. పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్న ఆయన కేంద్ర హోంమంత్రి నుంచి ప్రత్యేక మెడల్ కూడా అందుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఆయనకు నైపుణ్యం ఉంది.
కాగా, శనివారం సాయత్రం వినోద్ బడోలా చాణక్యపురిలోని నెహ్రూ పార్క్‌లో ఈవినింగ్ వాక్ చేస్తున్నారు. అయితే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ అని తెలియని ఇద్దరు దుండగులు గన్‌తో బెదిరించారు. ఆయన మెడలోని బంగారు గొలుసు ఇవ్వాలని హెచ్చరించారు. అలాగే ఒక వ్యక్తి వినోద్ ముక్కుపై పంచ్ ఇచ్చాడు. దీంతో కిందపడిన ఆయనకు రక్తం కారింది. దొంగలు ఆ వెంటనే వినోద్ మెడలోని గొలుసు లాక్కున్నారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
మరోవైపు తేరుకున్న పోలీస్ అధికారి వినోద్ వెంటనే ఎదురుదాడికి దిగాడు. గన్ ఉన్న దొంగను నిరాయుధుడ్ని చేసి పట్టుకున్నాడు. మరో దొంగ పారిపోగా స్థానిక పోలీసుల సహాయంతో వెతికి చివరకు అతడ్ని కూడా పట్టుకున్నాడు. ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గౌరవ్, పవన్ దేవ్‌గా గుర్తించారు. ఇద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

