Gay Marriages: చట్టసభలు నిర్ణయిస్తాయి.. గే మ్యారేజ్‌లను మళ్లీ వ్యతిరేకించిన కేంద్రం
Gay Marriages: హిందూ మతం, ఇస్లాం మతంలోనూ.. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లికే గుర్తింపు ఉందని కేంద్రం చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలను కేంద్రం వ్యతిరేకించింది. సుప్రీంలో దాఖలైన పిటీషన్లకు కౌంటర్‌గా అఫిడవిట్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు(Gay Marriages) చట్టబద్ధత కల్పించలేమని ఇవాళ మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లిళ్లను మాత్రమే వ్యవస్థ గుర్తిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టు(supreme court)లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా గే వివాహాలను చూడలేమని, ఇది ప్రతి పౌరుడి ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు పేర్కొన్నది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు గుర్తింపు కల్పిస్తే అప్పుడు వివాహ చట్టాన్ని సంపూర్ణంగా మార్చాల్సి వస్తుందని కోర్టు తెలిపింది.
స్వలింగ సంపర్కుల వివాహాలపై దాఖలైన పిటీషన్లకు కౌంటర్‌గా సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ వేసింది. అయితే గే మ్యారేజీలపై వేసిన పిటీషన్లు కేవలం పట్టణ ఎలైట్ వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే అవుతాయని, సామాజిక ఆమోదం కోసం ఆ పిటీషన్లు వాళ్లు వేశారని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. గే మ్యారేజీల గురించి పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. గే మ్యారేజీలకు చట్టబద్ధత కల్పించకపోవడం వివక్ష కాదు అని, ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వివాహాలకు గుర్తింపు ఉందని, భారతీయ సామాజిక కోణంలోనూ పెళ్లికి ప్రత్యేక విశిష్టిత ఉందని, హిందూ మత చట్టాల్లోని అన్ని శాఖల్లో ఆడ,మగ పెళ్లిని పవిత్రంగా చూస్తారని కేంద్రం తెలిపింది. ఇస్లాం మతంలోనూ పెళ్లి ఓ కాంట్రాక్టే అయినా, ఆ ఒప్పందం పవిత్రమైందని, కేవలం ఆడ, మగ మధ్య జరిగే పెళ్లిళ్లకు మాత్రమే ఆ మతంలోనూ ఆమోదం ఉందని కేంద్రం తన అఫిడవిట్లో వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

