Home
National
Central Govt Proposes To Hold Major Penalty Proceedings Against Former Bengal Chief Secretary Alapan Bandyopadhyay
బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శిపై చర్యలకు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయపై అఖిల భారత సేవల (క్రమశిక్షణ, అపీల్) నిబంధనల ప్రకారం కఠిన జరిమానా చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయనకు తెలియజేసింది. వ్యక్తిగతంగా లేక లిఖిత పూర్వకంగా తన వాదనను 30 రోజుల్లో తెలియజేయాలని పేర్కొంది. ఒకవేళ ఎలాంటి సమాధానం రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా విచారణ జరిపే అధికారం విచారణ అధికారులకు ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలపన్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించగా ఆయన స్పందించలేదు. సీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆయన సీఎం మమత వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన బదిలీపై బెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం రాజుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

