కేంద్రానికి ఆ లెక్కలు నచ్చలేదు: సీతారాం ఏచూరి
Sitaram Yechury: ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగుకు చేరడంతో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జనరల్ సెక్రెటరీ
న్యూఢిల్లీ: ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగుకు చేరడంతో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి దుమ్మెత్తిపోశారు. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్ ర్యాంకు 107వ స్థానానికి దిగజారడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ, అనైతిక నిర్ణయాలవల్లే దేశం ఆర్థికంగా వెనుకబడి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
దేశ పరిస్థితిపై అంతర్జాతీయంగా వెల్లడయ్యే ఏ లెక్కలను కూడా మోదీ ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో భారత్ అన్నిరంగాల్లో వెనుకబడిందని మండిపడ్డారు. అందుకే అంతర్జాతీయంగా ఏ నివేదిక వచ్చినా భారత్ అడుగున ఉంటున్నదని, ప్రభుత్వం మాత్రం వాటిని తప్పుడు లెక్కలుగా కొట్టిపారేస్తున్నదని ఆయన విమర్శించారు.
ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంటే కేంద్రం మాత్రం రాజకీయ లబ్ధి కోసం జనాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా బీజేపీ హింసా రాజకీయాలే చేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని ఆర్థికంగా ఎలా గట్టెంకించాలనే సోయి మాత్రం బీజేపీ సర్కారుకు రావడంలేదని సీతారాం ఏచూరి ఫైరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

