AFSPA | నాగాలాండ్, అరుణాచల్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరో ఆరు నెలలు పొడిగింపు
నాగాలాండ్ (Nagaland), అరుణాచల్‌ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించింది.
న్యూఢిల్లీ: నాగాలాండ్ (Nagaland), అరుణాచల్‌ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా (Disturbed area) గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022, సెప్టెంబర్ 30న ఏఫ్ఎస్పీఏ అమలు కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. ఈ నెలాఖరుతో ఆ గడువు ముస్తుండటంతో తాజాగా మరో ఆరు నెలలపాటు చట్టాన్ని పొడగిస్తూ కేంద్ర హోం శాఖ (MOH) నిర్ణయం తీసుకున్నది.
దీని ప్రకారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని చంగ్లాంగ్, తిరప్, లాంగ్డింగ్ జిల్లాలతోపాటు అసోం సరిహద్దుల్లోని నామ్సాయ్ జిల్లా నామ్సాయ్, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ చట్టం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అదేవిధంగా దిమాపూర్, నియులాండ్, చౌమౌకెడిమా, మోన్, కిఫైర్, నోక్లాక్, ఫెక్, పెరెన్ జిల్లాల్లోని ప్రాంతాలకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం వర్తిస్తుందని పేర్కొన్నది.
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 1958లో తీసుకొచ్చింది. జమ్ముకశ్మీర్‌తో పాటు, నాగాలాండ్, అసోం, మణిపూర్ (ఇంఫాల్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా), అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ వివాదాస్పద చట్టం వర్తిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో, అల్లరు చోటుచేసుకునే ప్రాంతాల్లో శాంతి భద్రతలనును నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని హెచ్చరించిన తర్వాత అతనిపై బలవంతంగా కాల్పులు జరపడానికి కూడా ఇది అనుమతిస్తుంది. ఎలాంటి వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
అయితే ఈ చట్టం వల్ల సంక్రమించిన అపరిమిత అధికారాలతో సైన్యం అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదనే విమర్శలున్నాయి. తిరుగుబాట్లు, నిషేధిత ఉగ్రవాద సంస్థలను అణచివేసే చర్యలు పేరుతో అమాయకులపై, మహిళలపై సైన్యం అనుచితంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అనేక పోరాటాలు సాగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

