Stock limit | మినుములు, కందిపప్పుల నిల్వలపై కేంద్రం ఆంక్షలు..!
Stock limit | పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిల్వలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Stock limit | పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిల్వలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు హోల్‌సేల్ వ్యాపారులు 200 మిలియన్ టన్నులకు మించి పప్పులను నిల్వ ఉంచకూడదు. రిటైల్ వ్యాపారులు 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ, పెద్ద చైన్ రిటైలర్స్ వద్ద 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఉంచకూడదని స్పష్టం చేసింది.
మిల్లర్ల వద్ద సైతం గత మూడునెలల్లో చేసిన ఉత్పత్తి మేరకు గానీ, లేదంటే వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో 25శాతంలో ఏది ఎక్కువైతే అంతకు వరకు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దిగుమతిదారులు కస్టమ్స్ క్లియరెన్స్ తేదీ నుంచి 60రోజుల కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న స్టాక్‌ను కలిగి ఉండేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే వినియోగదారుల వ్యవహారాల శాఖ పోర్ట్‌లో ఎప్పటికప్పుడు తమ స్టాక్స్ అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే, వర్షాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడం, ధరల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో కేంద్రం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు పప్పుల ఉత్పత్తులు సైతం భారీగా పడిపోయాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

