చెన్నై : కోతి చేష్టలు మామూలుగా ఉండవంటారు. కానీ కన్యాకుమారిలోని ఓ ప్లైవుడ్ కంపెనీ యజమాని కోతి చేసిన పనికి షాక్ తిన్నారు. సీసీటీవీ కెమెరాలను కోతి దొంగిలించడం గుర్తించి ఆయన కంగుతిన్నారు. ప్లైవుడ్ షాపు పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తించేందుకు యజమాని తన షాపులో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు.
చోరీలను పసిగట్టేందుకు తాను ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఒకదాని తర్వాత ఒక కెమెరా చోరీకి గురిఅవుతుండటంతో యజమాని విస్తుపోయాడు. కెమెరాలను చోరీ చేస్తున్న దొంగను పట్టుకునేందుకు యజమాని తీవ్రంగా ప్రయత్నించడంతో తన షాపు నుంచి సీసీటీవీ కెమెరాలను దొంగిలిస్తోంది ఓ కోతి అని తెలిసి షాక్ తిన్నాడు.
సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం బయటపడింది. యజమాని ఇప్పటివరకూ 13 సీసీటీవీ కెమెరాలను కోల్పోగా సీసీటీవీ కెమెరాలను చోరీ చేసిన కోతి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.