మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా టెన్త్ పాస్!
2028లో జరిగే పదో తరగతి బోర్డు పరీక్షల విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక స్పష్టత ఇచ్చింది. పరీక్షల్లో విద్యార్థులు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతోపాటు ఒక నైపుణ్య ఆధారిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు.
- 2028 పదో తరగతి పరీక్షల్లో సీబీఎస్ఈ కొత్త విధానం
- నైపుణ్య సబ్జెక్టుతో ఉత్తీర్ణతకు అవకాశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : 2028లో జరిగే పదో తరగతి బోర్డు పరీక్షల విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక స్పష్టత ఇచ్చింది. పరీక్షల్లో విద్యార్థులు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతోపాటు ఒక నైపుణ్య ఆధారిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు. గణతం, సైన్స్ లేదా సాంఘిక శాస్త్రంలో ఫెయిలైనా.. అదనంగా ఎంచుకున్న స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా పరీక్షలో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధానం ప్రస్తుతం తొమ్మిదో తరగతి (2026-27 విద్యాసంవత్సరం) చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. వీరు 2028లో పదోతరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ మార్పులు వర్తించవు.
ఐదు సబ్జెక్టులకు బోర్డు పరీక్షలు
కొత్త విధానం ప్రకారం విద్యార్థులు రెండు భాషలు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం అనే ఐదు సబ్జెక్టులకు తప్పనిసరిగా బోర్డు పరీక్షలు రాయాలి. అయితే, మొత్తం తొమ్మిది తప్పనిసరి పాఠ్యాంశాలను అభ్యసించాల్సి ఉంటుంది. వీటిలో మూడో భాష, కళా విద్య, శారీరక విద్య, ఆరోగ్యం, వృత్తి విద్య కూడా ఉంటాయి.
నైపుణ్య విద్యకు రెండు మార్గాలు
వృత్తి విద్య తప్పనిసరి అయినప్పటికీ, విద్యార్థులు దాన్ని పూర్తి చేసేందుకు రెండు మార్గాలను ఎంచుకోవచ్చు. మొదటిది కౌశల్ వికాస్. దీన్ని ఎంచుకున్న వారికి పాఠశాల స్థాయిలో అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు. కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే పాఠశాల ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. రెండో మార్గంలో బోర్డు గుర్తించిన 22 నైపుణ్య సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ మార్కెట్స్, హెల్త్‌కేర్ వంటి అంశాలు ఈ జాబితాలో ఉంటాయి. ఈ సబ్జెక్టును ఎంచుకున్న విద్యార్థులు పదో తరగతిలో సంబంధిత బోర్డు పరీక్ష రాయాలి. ఉత్తీర్ణులైన వారికి మార్కుల జాబితాలో మార్కులు, గ్రేడ్లను నమోదు చేయడంతోపాటు, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్) కింద నైపుణ్య ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సాధారణ పాఠ్యాంశాలతోపాటు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని బోర్డు భావిస్తున్నది.
కొన్ని పాఠ్యాంశాలకు మినహాయింపు
2026-27లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘ఇండివిడ్యూవల్స్ ఇన్ సొసైటీ’ అనే అంతరశాస్త్ర పాఠ్యాంశం, కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూళ్లు పాఠ్య ప్రణాళికలో ఉండవని సీబీఎస్ఈ స్పష్టంచేసింది. అలాగే 2027-28లో పదో తరగతి చదివే ఈ బ్యాచ్‌కు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా వర్తించదు. పాఠ్య ప్రణాళిక అమలు షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. విద్యా, పరీక్షల విధానంపై ముందుగానే స్పష్టత ఇవ్వడం ద్వారా విద్యార్థులు పరీక్షలకే పరిమితం కాకుండా అర్థవంతమైన అభ్యాసంపై దృష్టిపెట్టేలా చేయడమే లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

