గాంధీనగర్: ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఒక నర్సుపై వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన నర్సు ఆ రూమ్ నుంచి బయటకు పారిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Slaps Nurse) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 15 తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. డాక్టర్ ఎక్కడా అని అడిగి గొడవకు దిగాడు.
కాగా, ఒక నర్సు తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆమెను గమనించిన ఆ వ్యక్తి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ నర్సుపై చేయి చేసుకున్నాడు. ఆమె చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన ఆ నర్సు అక్కడి నుంచి బయటకు పరుగెత్తింది. ఆసుపత్రిలోని సిబ్బంది భద్రత, రాత్రి వేళ విధుల్లో ఉన్న వారి రక్షణ గురించి ఈ సంఘటన ఆందోళనలు రేకెత్తించింది.
మరోవైపు ఈ సంఘటన గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని దివ్యరాజ్సిన్హ్ గజేంద్రసిన్హ్ రాణాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. నర్సింగ్, వైద్య సిబ్బందికి క్షమాపణ చెప్పించారు. అయితే సీసీటీవీలో రికార్డైన నర్సుపై వ్యక్తి దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A disturbing incident at Limbdi Government Hospital in Gujarat’s Surendranagar district has raised concerns over the safety of healthcare workers after a man allegedly assaulted a nurse during her night shift.
The incident reportedly occurred in the early hours of August 15,… pic.twitter.com/CWZRs3nTPh
— Hate Detector 🔍 (@HateDetectors) August 20, 2026