New Covid Variant | భారత్‌లో ప్రవేశించిన ప్రమాదకర కొవిడ్ వేరియంట్.. గుజరాత్లో తొలి కేసు నమోదు
New Covid Variant | అమెరికాలో గుర్తించిన కొవిడ్ కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గుజరాత్లో నమైదైంది. BQ.1 వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకత దీని సొంతం.
New Covid Variant | ప్రమాదకరమైన కొవిడ్ XBB.1.5 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గురజరాత్‌లో నమోదైంది. ఇది గత వేరియంట్ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌ను ఇటీవలనే అమెరికాలో కనుగొన్నారు. ఈ వేరియంట్‌ను సూపర్ వేరియంట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా దవాఖానల్లో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉన్నదని చైనీస్ మూలాలున్న అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు.
ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లోనే ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. BQ.1 ఆర్ వ్యాల్యూ కంటే దీని ఆర్ వ్యాల్యూ ఎక్కువ. BQ.1 కంటే 108 శాతం వేగంగా విస్తరిస్తున్నది. దీని విస్తరణ క్రిస్మస్ కంటే ముందుగానే ప్రారంభమైంది. ఇప్పుడు దీని విస్తరణ వేగం 120 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. గత రెండు వారాల్లో ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వారి సంఖ్యను అమెరికాకు చెందిన సీడీసీ వెల్లడించలేదని ఎరిక్ చెప్పారు. చైనా మాదిరిగానే అమెరికా కూడా ఈ కొత్త వేరియంట్ డాటాను దాచిపెడుతున్నదని ఆరోపించారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నది.
ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. సింగపూర్‌లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

