Viral Video | బైక్‌ను ఢీ కొట్టి.. మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!
Viral Video | అతి వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహనాన్ని ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
Viral Video | అతి వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహనాన్ని ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మోనూ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన తన వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన హోండా సిటీ కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు కింద బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న జనం కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కారులో ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బైక్‌ను కారు ఈడ్చుకెళ్లిన సమయంలో రోడ్డుపై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ తన వాహనాన్ని వదిలి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడి ఫిర్యాదు ఆధారంగా కారు డ్రైవర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279, 336, 427 తదితర షెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కారు డ్రైవర్ ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు సెక్టార్ 63లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
गुरुग्राम में दिल्ली के कंझावला जैसी घटना सामने आई है। सेक्टर-62 में तेज गति से आ रही कार की टक्कर लगने से बाइक कार के नीचे फंस गई। नशे में धुत्त कार चालक ने बाइक को करीब 4 किलोमीटर तक घसीटा। सड़क पर रगड़ते हुए बाइक से चिंगारियां निकलती रही।#Gurugram #LiveVideo @DC_Gurugram pic.twitter.com/QWgFDQkb7i
— Amit Singh 🇮🇳❣️ (@KR_AMIT007) February 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

