Watch: 8 సార్లు పల్టీలు కొట్టిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Car Flips 8 Times | హైవేపై వేగంగా వెళ్లిన కారు అదుపుతప్పింది. రోడ్డుపై 8 సార్లు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులకు చిన్నగాయమైనా కాలేదు. పైగా అక్కడున్న వారిని టీ అడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: హైవేపై వేగంగా వెళ్లిన కారు అదుపుతప్పింది. రోడ్డుపై 8 సార్లు పల్టీలు కొట్టింది. (Car Flips 8 Times) అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులకు చిన్నగాయమైనా కాలేదు. పైగా అక్కడున్న వారిని టీ అడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొందరు వ్యక్తులు నాగౌర్ నుంచి బికనీర్ వెళ్లేందుకు ఎస్‌యూవీలో ప్రయాణించారు. అయితే హైవేపై వేగంగా వెళ్తున్న ఆ కారు ఒక మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ స్టీరింగ్‌పై కంట్రోల్ తప్పడంతో ఆ కారు రోడ్డుపై ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. రహదారి పక్కన ఉన్న కారు షోరూమ్ గేట్‌ను బలంగా ఢీకొట్టి ఆగింది.
కాగా, కారు పల్టీలు కొడుతుండగా డ్రైవర్ కిందకు దూకేశాడు. కారులోని మిగతా నలుగురు వ్యక్తులు ప్రమాదం తర్వాత కిందకు దిగారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ కూడా చిన్న గాయమైనా కాలేదు. ఈ సంఘటన తర్వాత కారు షోరూమ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తులు తమకు టీ ఇవ్వాలని అడిగినట్లు అక్కడున్న ఆ ఏజెన్సీ అధికారి తెలిపారు. కారు ఎనిమిది సార్లు పల్టీలు కొట్టినప్పటికీ అందులో ప్రయాణించిన వ్యక్తులు అద్భుతంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl
— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

