Jabalpur airport | ఎయిర్పోర్ట్ షెడ్ నుంచి కూలిన మెటల్.. ధ్వంసమైన కారు
Jabalpur airport | ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింది.
భోపాల్: ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ (Jabalpur airport) దుమ్నా విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఒక వీఐపీని దించేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రభుత్వ వాహనం డ్రాప్ అండ్ గో సైట్ వద్ద నిలిచి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రధాన గేటు వెలుపల ఏర్పాటు చేసిన టెంట్ భాగం కూలింది. దాని కింద పార్క్ చేసి ఉన్న కారుపై పెద్ద మెటల్ పడింది. దీంతో కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది.
కాగా, విమానాశ్రయం టెర్మినల్ భవనంలోకి వర్షపు నీరు చేరకుండా కనోపీ టెంట్ నిర్మించారు. అయితే వర్షపు నీరు చేరడంతో ఇనుప డోమ్ కూలినట్లు తెలుస్తున్నది. దుమ్నా విమానాశ్రయం డైరెక్టర్ ఈ సంఘటనపై స్పందించారు. కానోపీ టెంట్ భాగం కూలడంపై దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు కోరినట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రి రాకేష్ సింగ్ తెలిపారు. ఎయిర్పోర్ట్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. అయితే ఎయిర్పోర్ట్ వద్ద ప్రభుత్వ వాహనం ధ్వంసమైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Accident at Jabalpur airport.#accident #Jabalpur @ekujain11 pic.twitter.com/F1WD3ReHzU
— himanshu jh (@dwapar) June 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- canopy shed
- car
- Damaged
- Falls
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

