మసాలాలతో క్యాన్సర్‌కు వైద్యం
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు.
- మద్రాస్ ఐఐటీకి దక్కిన పేటెంట్
- జంతువులపై ప్రయోగాలు సక్సెస్
- త్వరలోనే మనుషులపై ట్రయల్స్
- 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి 2028 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్‌లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ తెలిపారు. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్‌తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు నిరూపించారు. ఈ ఔషధంతో క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ముప్పూ ఉండదని తెలిపారు. జంతువులపై ఈ ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలిచ్చాయి. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్నదానిపై దృష్టిపెట్టినట్టు నాగరాజన్ తెలిపారు.
తీవ్రమైన ఒత్తిడితో క్యాన్సర్ ముప్పు!
తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్స్, గుండె సమస్యలేగాక..క్యాన్సర్ బారిన పడే అవకాశమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఒత్తిడిని ముందే గుర్తించి, చికిత్స తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి ముదరకుండా ప్రాథమిక దశలో అడ్డుకోవచ్చునని న్యూయార్క్‌లోని ‘కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ’ సైంటిస్టులు కనుగొన్నారు. స్ట్రెస్ హార్మోన్స్ ప్రభావంతో తెల్లరక్త కణాలైన ‘న్యూట్రోఫైల్స్’ శరీరంలో క్యాన్సర్ కణతులు ఏర్పరుస్తున్నాయని, ఎలుకలపై వివిధ రకాలుగా జరిపిన ప్రయోగాల్లో ఇది నిరూపితమైందని పరిశోధకులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

