CRPF Soldier Killed | మణిపూర్‌లో తీవ్రవాదుల ఆకస్మిక దాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
CRPF Soldier Killed | మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ మరణించాడు. (CRPF Soldier Killed) జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాం సరిహద్దు జిల్లా ప్రాంతంలో పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. పెట్రోలింగ్ వాహనం సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్ నడుస్తూ వెళ్తుండగా తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా, ఆ వాహనంలో ఉన్న ఇద్దరు పోలీస్ కమాండోలు గాయపడ్డారు. జవాన్లు ఎదురు కాల్పులు జరుపడంతో తీవ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో కూంబిగ్ ఆపరేషన్ జరుగుతోందని అన్నారు.
కాగా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. సీఆర్పీఎఫ్ జవాన్‌ను చంపడాన్ని ఖండించారు. కుకీ తీవ్రవాదుల దాడిగా అనుమానం వ్యక్తం చేశారు. గాయపడిన పోలీస్ కమాండోలు త్వరగా కోలుకోవాలని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ambush
- CRPF Soldier
- Jiribam
- Killed
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

