అంబానీ ఫ్యామిలీకి, రిలయన్స్ హాస్పిటల్కు బాంబు బెదిరింపు
Bomb threat: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ ల్యాండ్లైన్ నెంబర్కు ఫోన్ చేసి.. హాస్పిటల్కు బాంబు పెట్టినట్లు చెప్పాడు. ముకేశ్ అంబానీ కుటుంబసభ్యుల్లో కొందరి పేర్లను ప్రస్తావించి వారిని కూడా చంపేస్తామని చెప్పాడు.
దీనిపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు చర్యలు మొదలుపెట్టారు. కాగా, అంబానీకి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన కొన్ని నెలలకే ఇలాంటి బెదిరింపు కాల్ రావడం గమనార్హం. ముకేశ్ అంబానీకి 2013 నుంచి జడ్ కేటగిరి భద్రత ఉంది.
అయితే, ఇటీవల ఆయన ఇంటిముందు పార్క్ చేసి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించాయి. దాంతో జడ్ కేటగిరీ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి మార్చారు. అంటే ఆయనకు నిత్యం 45 నుంచి 50 మంది సాయుధులైన సీఆర్పీఎఫ్ కమోండోలు రక్షణ గోడలా ఉంటారు. ముకేశ్ భార్య నీతా అంబానీకి కూడా ప్రస్తుతం వై ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

