బాధితురాలి ఛాతీని తాకితే లైంగిక వేధింపులుగా పరిగణించాలి : హైకోర్టు
బాధితురాలి ఛాతీని దురద్దేశంతో తాకితే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని కోల్‌కతా హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.
కోల్‌కతా : బాధితురాలి ఛాతీని దురద్దేశంతో తాకితే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని కోల్‌కతా హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. బాధితురాలి వక్షోజాలు ఎదగకపోయినా ఆ ప్రదేశంలో నిందితుడు దురుద్దేశంతో తాకితే లైంగిక వేధింపులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. 2017లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలిక (13)ను నిందితుడు అసభ్యంగా తాకుతూ ముద్దు పెట్టుకున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలి ఛాతీని తాను తాకాననే వాదన ఉత్పన్నం కాదని, వైద్యాధికారి నివేదికలో ఆమె ఛాతీ ఎదగలేదని స్పష్టం చేశారని నిందితుడు వాదించాడు. అయితే ఈ వాదన పసలేనిదని పోక్సో చట్టంలోని సెక్షన్ ఏడు కింద ఆ ప్రదేశంలో తాకడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందని కోర్టు తేల్చిచెప్పింది.
బాధితురాలి ప్రైవేట్ భాగాలను తాకడం లైంగిక వేధింపులుగానే పరిగణించాలని కలకత్తా హైకోర్ట్ స్పష్టం చేశారు. ఎవరైనా లైంగిక ఉద్దేశ్యంతో తాకడం సహా ఇతర చర్యలకు పాల్పడితే అది కూడా లైంగిక వేధింపులుగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. నిందితుడిని పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను హైకోర్టు నిర్ధారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assault
- Calcutta
- High court
- ruling
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

