2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లకు చెల్లుచీటీ : కలకత్తా హైకోర్టు సంచలన ఉత్తర్వులు
పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను తోసిపుచ్చుతూ కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఓబీసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ జస్టిస్ తపబ్రత చక్తవర్తి, రాజశేఖర్ మంథాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ కమిషన్ ఓబీసీల తాజా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది.
2010 తర్వాత తయారుచేసిన ఓబీసీ జాబితా చట్టవిరుద్ధమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం, 2012లోని సెక్షన్ 2హెచ్, 5,6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగవిరుద్ధమని కొట్టివేసింది.
2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు అన్నీ 1993 (బీసీ కమిషన్) చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన సర్టిఫికెట్లు వారికి లభించలేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. కాగా, 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లపై తీర్పు ప్రభావం ఉండదు.
Read More :
KTR | తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్.. చోటా భాయ్‌పై కేటీఆర్ సెటైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

