వైరల్ వీడియో : వీధి బాలలకు స్నాక్స్ అందించిన బస్ డ్రైవర్..!
కేరళకు చెందిన ఓ బస్ డ్రైవర్ వీధి బాలలకు స్నాక్స్ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్ డ్రైవర్ ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తిరువనంతపురం : కేరళకు చెందిన ఓ బస్ డ్రైవర్ వీధి బాలలకు స్నాక్స్ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్ డ్రైవర్ ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇన్స్టాగ్రాం యూజర్ ఫవస్సీ షేర్ చేసిన ఈ వీడియోలో బస్ డ్రైవర్ ఇద్దరు వీధి బాలలకు బిస్కెట్ పాకెట్లు, స్నాక్స్ ఇవ్వడం కనిపిస్తుంది. డ్రైవర్ తమ పట్ల దయతో స్నాక్స్ ఇవ్వడం చిన్నారుల ముఖాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది.
వారి ముఖాల్లో నవ్వులు నెటిజన్ల హృదయాలను మెలిపెట్టాయి. జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందిని కలుసుకుంటాం..ఇందులో బాధాకరమైనదేంటంటే ఆకలి తీర్చుకోవడానికి చాలా మంది చేసే పనులు..వారి ఆకలి తీర్చడం మనకు లభించిన గొప్ప అవకాశం..అసలు ఆకలి అంటే మనకు తెలియదని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 9.8 లక్షల మంది వీక్షించారు. డ్రైవర్ ఔదార్యంపై పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. అతడి నుంచి మనలో చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

